బిగ్ న్యూస్: ఎంపీ విజయ సాయి రెడ్డి కి కేశినేని నాని దిమ్మ తిరిగే ప్రశ్న!

Friday, May 29th, 2020, 06:50:16 PM IST


ప్రతిరోజూ ఏదో ఒక అంశం పై చంద్రబాబు నాయుడు పై, టిడిపి నేతల పై ఎంపీ విజయ సాయి రెడ్డి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయితే మహానాడు కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు పై విజయ సాయి రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. బాబూ..ఎన్టీఆర్ జయంతి నాడు ఆయన విగ్రహం కళ్ళల్లోకి చూసే దండ వేశావా అని ప్రశ్నించారు. నీ కంట్లో ఒక్క చుక్క అయినా నీరు వచ్చిందా, పాపం కదా అని విజయ సాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు విజయ వాడ ఎంపీ, టిడిపి నేత కేశినేని నాని దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. వేల కోట్ల రూపాయల ప్రజా ధనం దోచుకొని 16 నెలలో జైల్లో ఉన్నావు కదా ఒక్కసారైనా పశ్చాత్తాపానికి గురి అయ్యవా అని ప్రశ్నించారు.అయితే కేశినేని నాని చేసిన ఆరోపణలకి నెటిజన్లు సైతం తీవ్రంగా స్పందిస్తున్నారు. కొందరు విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను సమర్దిస్తుండగా, మరి కొందరు మాత్రం కేశినేని నాని చేసిన వ్యాఖ్యలకి మద్దతు తెలుపుతున్నారు. అయితే మహానాడు లో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చేసిన తీర్మానాల పై న వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో మరొక్క సారి వైసీపీ నేతలు చంద్రబాబు పై విరుచుకుపడుతున్నారు.