ఎవ్వరికీ బయపడనంటున్న నాని.. చంద్రబాబు గురించేనా ?

Wednesday, June 12th, 2019, 10:15:17 AM IST

ఎన్నికల్లో ఓటమి టీడీపీని ఒక రంకంగా బాధిస్తుంటే పార్టీలోని అగ్రనేతల మధ్యన రాజుకుంటున్న చిచ్చు మరోలా ఇబ్బందిపెడుతోంది. చంద్రబాబు ఆఫర్ చేసిన విప్ పదవిని తిరస్కరించడంతో పార్టీపై, నేతలపై నాని తిరుగుబాటు బయటపడింది. విప్ పదవికి తాను అర్హుడిని కాదన్న నాని ఆ పదవిని సమర్థులకు ఇవ్వాలని సూచించారు. అంతేకాదు గుడివాడలో ఎంపీగా గెలిచిన కొడాలి నానిని ఉద్దేశించి మంత్రిని చేసిన దేవినేని ఉమాను మర్చిపోవద్దు అన్నారు.

ఈ పోస్ట్ వెనక పదవిలో ఉన్నప్పుడు దేవినేని ఉమా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగానే అవినాష్ ఓడిపోయాడని, నాని గెలిచాడనేది కేశినేని నాని ఉద్దేశ్యమని అందరూ అన్నారు. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బాబు న్యాయకత్వాన్నే శంకిస్తున్నారని, బాబు దయ వలనే పదవిలో ఉన్నారని నానిఫై బాబు భక్తి వర్గం విరుచుకుపడింది.

దీంతో నాని నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు. నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం. నిజాన్ని నిజమని , అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను. మంచిని మంచి, చెడును చెడు అనే అంటాను. న్యాయాన్ని న్యాయమని, అన్యాయాన్ని అన్యాయమని మాట్లాడతాను. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మాత్రమే తెలిసిన వాడిని. నిండు సభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మోడీని నిలదీసిన వ్యక్తిని. భయం నా రక్తంలో లేదు. రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదు. ఎవరెన్ని పెడార్థాలు తీసిన, వీపరీతార్థాలు తీసినా లెక్క చేసే వాడిని కాదు అంటూ ఘాటైన పోస్ట్ పెట్టారు. ఈ వార్నింగ్స్ అన్నీ బాబు అండ్ టీమ్ కోసమే అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.