బిగ్ బ్రేకింగ్ : బాబుకు బిగ్ షాక్..పార్టీ మార్పుపై కేశినేని నాని సంచలనం.?

Thursday, June 6th, 2019, 10:32:30 AM IST

ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంతంత మాత్రం గానే ఉంటే పార్టీలోని ఇప్పుడు అసమ్మతి నేతలను చంద్రబాబు కొనితెచ్చుకుంటున్నారు.తాజాగా చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయం వలన ఆ పార్టీకు చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.లోక్ సభలో ప్రభుత్వ విప్ పదవి తనకి కేటాయించినప్పటి నుంచి దాన్ని అధికారికంగానే తిరస్కరించి రాజకీయ వర్గాల్లో సంచలనం రేపారు.తాను ఆ పదవి అయితే ముందే వద్దన్నానని చెప్పానని కానీ చంద్రబాబు తనకు ఆ పదవిని కట్టబెట్టడం నాకు అస్సలు నచ్చలేదని తెలిపారని తెలుస్తుంది.

అలాగే అలాగే పార్లమెంటు పార్టీ నేతగా మరియు మరో కీలక పదవిని కూడా గల్లా కుటుంబానికే ఇవ్వడం పార్టీకే మంచిది కాదని తెలిపారట.ఆ తర్వాత చంద్రబాబు ఇన్నిటికి పిలిచి ఏకాంతంగా మాట్లాడినా కూడా నాని ససేమిరా అన్నట్టు తెలుస్తుంది.ఇన్ని ప్రతికూల పరిస్థితులు నానికి ఎదురు కావడంతో నాని పార్టీ మారిపోతారు అన్న వార్త కూడా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది.కానీ వీటన్నింటిపై నాని చెక్ పెట్టేశారట.తనకు చంద్రబాబు సారథ్యంలోనే పని చేస్తానని మరెవ్వరి దగ్గర పనిచేసేది లేదు అని అలాగే పార్టీ అయితే మారే ప్రసక్తే లేదని స్పష్టం చేసారని తెలుస్తుంది.