బిగ్ బ్రేకింగ్: కొడాలి నానిపై కేశినేని నాని షాకింగ్ కామెంట్స్..!

Monday, June 10th, 2019, 01:42:31 PM IST

ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ రూపు రేఖలు మారిపోయాయనే చెప్పాలి. అయితే ఈ ఎన్నికలలో అందరి అంచనాలను మించి వైసీపీ భారీ విజయం సాధిస్తే, టీడీపీ మాత్రం ఊహించని పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే టీడీపీ ఈ సారి కేవలం 23 అసెంబ్లీ స్థానాలను, 3 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. అయితే ఇప్పుడు గెలిచిన వారిలో కూడా కొంతమంది పార్టీ మారుతున్నారంటూ వార్తలు వినిపించాయి. ఈఎ మధ్య కాలంలో ఎంపీ కేశినేని నాని వ్యవహారం చూస్తుంటే పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని అందరికి అర్ధమైపోయింది. అయితే తాజాగా చంద్రబాబు విప్ పదవి ఇస్తే నేను అర్హుడను కాదు, నాకు ఆ పదవి వద్దు అంటూ తిరస్కరించారు. అంతేకాదు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఆయన పెడుతున్న ట్వీట్‌లు కూడా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

అయితే తాజాగా మరో సారి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి వార్తల్లోకి ఎక్కాడు. ఈ సారి గుడివాడ నుంచి పోటీ చేసి వరుసగా నాలుగో సారి విజయం సాధించి జగన్ కేబినెట్‌లో మంత్రి స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఇక్కడ నానికీ పోటీగా టీడీపీ దేవినేని కుమారుడు దేవినేని అవినాష్‌ను బరిలో నిలిపింది. అయితే ఇక్కడ టీడీపీ కొడాలి నాని ముందు గెలిచి నిలబడలేకపోయింది. అయితే కేశినేని నాని మాత్రం కొడాలి నానిపై ఒక సంచల ట్వీట్ చేశారు. కొడాలి నాని తనని మంత్రిని చేసిన దేవినేని ఉమాకి జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వివాదస్పదమైంది. అయితే ఈ పోస్ట్ అసలు కేశినేని నాని ఏ ఉద్దేశ్యంతో ఆలొచించి పెట్టాడో తెలీదు కానీ, నెటిజన్లు మాత్రం కేశినేనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారట. మీ పదవికి తగ్గ రీతిలో మీరు వ్యవహరిస్తే బాగుంటుందని అది దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే మంచిదని టీడీపీ శ్రేణులు కూడా కేశినేనికి సలహాలు ఇస్తున్నారట. అయితే ఇదివరకే దేవాదాయ శాఖమంత్రి బాధ్యతలు స్వీకరించిన వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్ట్ చేశాడు. అయితే కేశినేని చేసిన ఈ కామెంట్‌పై మంత్రి కొడాలి నాని ఎలా స్పందిస్తాడనేది మాత్రం ఇప్పుడు పెద్ద చర్చానీయాంశంగా మారింది.