కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్…?

Tuesday, February 11th, 2020, 08:23:38 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని కలెక్టర్లకు తాజాగా పలు కీలక బాధ్యతలను అప్పగించారు. కాగా మంగళవారం నాడు ప్రగతి భవన్ లో కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. కాగా ఈ సదస్సులో పాల్గొన్న సీఎం కేసీఆర్ కలెక్టర్లు పలు కీలక ఆదేశాలు చేశారు. కాగా రాష్ట్రంలో రాష్ట్రాభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి పలు పథకాలను అమలు చేయడమే కలెక్టర్ల ప్రార్దన బాధ్యత అయి ఉండాలని సీఎం ఎంకేసీఆర్ వెల్లడించారు. అంతేకాకుండా ఎట్టిపరిస్థితుల్లోను పథకాల అమలు విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అయితే ఈ సదస్సులో పలువురు మంత్రులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, జీహెచ్ఎంసీ మేయర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అయితే ఈ సదస్సులో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ చట్టంపై కూడా చర్చించారని సమాచారం. అయితే తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత చాలా తక్కువ కాలంలోనే వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించామని, అందుకు కారణం పలు సంక్షేమ పథకాలే అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇకపోతే రాష్ట్ర ప్రజలందరికోసం రూపొందించినటువంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేయడమే జిల్లా యంత్రాంగం యొక్క ప్రధాన ప్రాధాన్యతగా మారాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు కూడా జారీ చేశారు.