మెగాస్టార్ ను టెన్షన్ పెడుతున్నది ఎవరు ?

Wednesday, November 2nd, 2016, 12:17:01 PM IST

kaidhi-number-150
మెగాస్టార్ చిరంజీవిని ఇప్పుడు బాగా టెన్షన్ పెడుతున్నారట? ఇంతకి ఆయన్ను టెన్షన్ పెడుతున్నది ఎవరు ? అనే విషయం సంచలనం గా మారింది. ఆయన్ను టెన్షన్ పెడుతున్నది ఎవరో కాదు డిస్ట్రిబ్యూటర్స్ ? ఎందుకంటే … మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న ”ఖైదీ నంబర్ 150” వ సినిమా షూటింగ్ దాదాపు పూర్తీ కావొచ్చింది. ఇప్పటికే టాకీ పూర్తీ చేసుకోని, నెలలోనే పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లనుంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా జరుగుతున్నాయి. ఇక ఈ సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. ఎందుకంటే ఈ సంక్రాంతికి ఇప్పటికే బాలకృష్ణ ”గౌతమిపుత్ర శాతకర్ణి” తో సిద్ధంగా ఉన్నాడు, దాంతో పాటు దిల్ రాజు ”శతమానం భవతి” అంటూ రెడీ అవుతున్నాడు, అలాగే నాగార్జున కూడా ”ఓం నమో వెంకటేశాయ” తో రావొచ్చు .. కాబట్టి ఈ సినిమాను వాటికంటే ఒకరోజు ముందే విడుదల చేయాలనీ వారు ఫోర్స్ చేస్తున్నారట ? ఎందుకంటే .. ఒకరోజు ముందు విడుదల అయితే .. రెవెన్యూ పరంగా మొత్తం ఆ ఒక్క రోజులో వసూలు చేసుకోవొచ్చు .. లేదంటే అన్ని సినిమాల పోటీలో రెవెన్యూ విడిపోతుంది కాబట్టి, ఒకరోజు ముందే విడుదల చేయాలనీ వారు అంటున్నారట. ఇక ”గౌతమి పుత్ర” .. జనవరి 12 లేదా 13 న విడుదల అవుతుంది, ”శతమానం భవతి” కూడా 13 న రావొచ్చు, కాబట్టి చిరంజీవి సినిమా 9 కానీ లేక 11 న కానీ విడుదల చేయాలనీ వారు ఫోర్స్ చేస్తున్నారట అది విషయం.