ర‌త్తాలు.. సాంగ్‌లో రాయ్ ల‌క్ష్మీ ర‌చ్చ ర‌చ్చ‌

Saturday, December 31st, 2016, 02:32:00 AM IST

raathalu
రాయ్ ల‌క్ష్మీ రెచ్చిపోయి చిచ్చు రేపేయ‌డం ఖాయం అని తెలుస్తోంది. `ఖైదీనంబ‌ర్ 150` అదిరిపోయే మాస్ పెప్పీ సాంగ్ ఇద‌ని చిత్ర‌యూనిట్ చెబుతోంది. ఈ సాంగ్ ఆడియోతో పాటు విజువ‌ల్‌గా అదిరిపోతుంది. రాయ్ ల‌క్ష్మీ గ‌ర‌మ‌గ‌ర‌మ అందాలు క‌నువిందు చేస్తాయ‌ని చెబుతున్నారు.

ఆల్రెడీ మార్కెట్లో `ఖైదీనంబ‌ర్ 150` ఆడియో ఆల్బ‌మ్ సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఈ ఆల్బ‌మ్ నుంచి ఒక్కో పాట‌ను విడివిడిగా రిలీజ్ చేస్తూ బాస్ వేడి పెంచేశారు. అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు, సుంద‌రి, యు అండ్ మి.. సాంగ్స్ యూట్యూబ్‌లో, సామాజిక మాధ్య‌మాల్లో, యువ‌త‌రం మొబైల్స్‌లో రింగ్‌టోన్లుగా, ఆడియో ఫైల్స్ రూపంలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇప్పుడు వాట‌న్నిటినీ కొట్టే సాంగ్ డిసెంబ‌ర్ 31న‌ రిలీజ్‌కి రెడీ అవుతోంది. `రత్తాలు…` అంటూ సాగే స్పెషల్‌ సాంగ్‌ను కొత్త సంవత్సరం కానుకగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సాంగ్‌లో రాయ్‌ లక్ష్మీ చిరంజీవితో కలిపి స్టెప్‌లు క‌లిపింది. లారెన్స్ మాష్ట‌ర్‌ నృత్య దర్శకత్వం వహించిన గీత‌మిది. ఇది ఆల్బ‌మ్‌లోనే వెరీ స్పెష‌ల్ సాంగ్ అంటూ చెబుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments