కోట్ల స్టేడియంలో జ‌న‌వ‌రి 28న ‘ఖైదీనంబ‌ర్ 150’ థాంక్స్‌మీట్‌

Wednesday, January 25th, 2017, 03:53:33 PM IST

khaidi
బాస్ ఈజ్ బ్యాక్. మెగాస్టార్ చిరంజీవి ఈజ్ బ్యాక్‌. ప్ర‌స్తుతం ఏ నోట విన్నా ఖైదీనంబ‌ర్ 150 .. సంచ‌ల‌నాల గురించే చ‌ర్చ సాగుతోంది. దాదాపు ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత బాస్ చిరంజీవి బ‌రిలోకి దిగ‌డ‌మే కాకుండా బాక్సాఫీస్ రికార్డుల‌తో హోరెత్తించారు. `ఖైదీనంబ‌ర్ 150` అత్యంత వేగంగా 100 కోట్ల క్ల‌బ్‌లో చేరిన సినిమాగా రికార్డు సృష్టించి, అటుపై కేవ‌లం వారం రోజుల్లో 150 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. గ్యాప్‌తో సంబంధ‌మే లేకుండా.. డ్యాన్సులు, ఫైట్స్‌, న‌ట‌న‌లో మెగాస్టార్‌లో ఈజ్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. విమ‌ర్శించ‌డానికి ఎదురు చూసిన నోళ్లే పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాయి.

ఈ స‌క్సెస్ అల్టిమేట్‌. ఇంత గొప్ప విజ‌యానికి కార‌కులు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగుసినీ ప్రేక్ష‌కాభిమానులు, మెగాభిమానులు. అందుకే బాస్ అంద‌రికీ కృత‌జ్ఞ‌తాభివంద‌నాలు తెలుపుకోవాల‌నుకుంటున్నారు. అందుకోసం కోట్ల విజ‌య‌భాస్క‌ర రెడ్డి స్టేడియం ఘ‌నంగా సిద్ధ‌మ‌వుతోంది. జ‌న‌వ‌రి 28న సాయంత్రం 5 గంట‌ల నుంచి జ‌రిగే `ఖైదీనంబ‌ర్ -150 థాంక్యూ మీట్‌` కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి, చిత్ర ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్‌, నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ స‌హా టోట‌ల్ చిత్ర‌యూనిట్ ఈ వేడుక‌లో పాల్గొన‌నుంది.