ఫాస్టెస్ట్ టాలీవుడ్ 100 కోట్ల మూవీ – `ఖైదీనంబ‌ర్ 150`

Thursday, January 19th, 2017, 11:35:52 AM IST

khaidhin150
ఖైదీనంబ‌ర్ 150 .. ప్ర‌స్తుతం ఈ సినిమా సృష్టిస్తున్న సంచ‌ల‌నాల గురించే ఇంటా బ‌య‌టా చ‌ర్చ సాగుతోంది. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత బాస్ బ‌రిలో దిగితే ఈ స్థాయి ఆద‌ర‌ణ ద‌క్కుతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. టాలీవుడ్‌లోనే అత్యంత వేగంగా 100 ప్ల‌స్ క్రోర్స్ వ‌సూలు చేసిన చిత్రంగా చ‌రిత్ర సృష్టించింది. ఈ ఆనంద స‌మ‌యాన ద‌ర్శ‌కుడు వినాయ‌క్‌, అల్లు అర‌వింద్ పాత్రికేయుల‌తో మాట్లాడారు.

ఫాస్టెస్ట్ 100 ప్ల‌స్ క్రోర్‌ గ్రాస్‌ను సాధించిన చిత్రం -ఖైదీనంబ‌ర్ 150. ఏడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 76 కోట్ల 15 ల‌క్ష‌ల 4 వేల రూపాయ‌ల‌ను, క‌ర్ణాట‌క‌లో 9 కోట్లు, నార్త్ ఇండియాలో కోటి 43 ల‌క్ష‌లు నార్త్ అమెరికాలో 17 కోట్ల రూపాయ‌లు, రెస్టాఫ్ ది వ‌ర‌ల్డ్‌లో 3 కోట్ల 96లక్ష‌లు, ఒరిస్సాలో 40ల‌క్ష‌లు, ఇలా మొత్తంగా 108కోట్ల 48ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను సాధించి మొద‌టివారంలో హ‌య్య‌స్ట్ గ్రాసర్‌గా నిలిచింద‌ని అల్లు అర‌వింద్ తెలిపారు

అన్న‌య్య‌పై ప్రేమ‌ను ప్ర‌జ‌లు క‌లెక్ష‌న్స్‌ రూపంలో చూపిస్తున్నారు. అన్న‌య్య 150వ సినిమా ఖైదీ నంబ‌ర్ 150ను పెద్ద స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. చాగ‌ల్లు అనే మా చిన్న ఊరిలో ఐదు లక్ష‌లు పైగా క‌లెక్ష‌న్స్‌ను సాధించదంటే సినిమా ఎంత పెద్ద స‌క్సెస్ అయ్యిందో అర్థం చేసుకోండి. క‌త్తిలాంటి మంచి క‌థ‌ను ఇచ్చిన మురుగ‌దాస్ గారికి థాంక్స్‌. సాధార‌ణంగా సినిమా స‌క్సెస్‌లో క‌థ‌భాగం 51శాతం అయితే సినిమా ప్రారంభంలో అన్న‌య్య అందంగా క‌న‌ప‌డితే 51 శాతం అనుకున్నాను… అంటూ వినాయ‌క్ త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.