న్యూ ఇయర్ కి మనకోసం ‘ రత్తాలు ‘ రాబోతోంది ! హాట్ హాట్ గా !

Friday, December 30th, 2016, 11:31:01 AM IST

kaidhi-number-150
సింగిల్ నెంబర్ సాంగ్స్ అంటూ ఒక్కొక్క పాట నీ విడుదల చేస్తున్నారు కొణిదెల ప్రొడక్షన్స్ వారు. ఖైదీ నెంబర్ 150 కి సంబంధించి చిరు – కాజల్ ల అమ్మడు పాట ఫస్ట్ విడుదల చేసారు ఆ తరవాత రెండు సింగిల్స్ విడుదల చేసారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా మరొక సూపర్ హిట్ పాటని విడుదల చెయ్యబోతున్నారు. సింగిల్స్ విడుదల చేసిన తక్కువ టైం లోనే యూ ట్యూబ్ లో ఎక్కువ హిట్స్ ని చేరుకుంది ఖైదీ సింగల్ సాంగ్ వ్యూస్ . ఈ కాన్సెప్ట్ సూపర్ హిట్ అవ్వడంతో సినిమాలో వున్న ఐటెం సాంగ్ ని కూడా ఇదే పద్ధతిలో విడుదలచెయ్యడానికి నిర్ణయించారు. అది కూడా కొత్త సంవత్సర కానుకగా అభిమానులకు అందించడం విశేషం. ఈ సినిమాలో మెగాస్టార్ పక్కన ఐటెం సాంగ్ లో నటి లక్ష్మిరాయ్ చిందేసిన సంగతి తెలిసినదే. రత్తాలూ అంటూ మొదలయ్యే ఈ సాంగ్ రచ్చ లేపుతుందని అందరూ భావిస్తున్నారు. దేవి ఎలానో ఐటెం సాంగుల స్పెషలిస్ట్ గాబట్టి అంచనాలు మరింత పెరగడం సహజం.

  •  
  •  
  •  
  •  

Comments