డౌటే లేదు … ఈ ఖైదీ నిజంగా నైజాం దాదానే !!

Friday, December 30th, 2016, 11:32:47 AM IST

kaidhi-number-150
మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ఎలాంటిదో ఇవాళ కొత్తగా చెప్పేది ఏమిలేదు. ముఖ్యంగా చిరంజీవికి నైజాంలో తిరుగులేని ఇమేజ్ ఉంది. ఇక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎనిమిదేళ్ల తరువాత రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న ”ఖైదీ నంబర్ 150” వ సినిమా ఈ సంక్రాంతికి రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో కూడా అంతే సంచలనం రేపుతోంది. ఇప్పటికే కర్ణాటక, ఓవర్ సీస్ హక్కుల విషయంలో దుమ్ము రేపిన చిరంజీవి, ఇప్పుడు ఏకంగా నైజం హక్కుల విషయంలో కూడా నిజంగా నేను నైజాం దాదానే అంటుంటాడు. ఈ మూవీ సాటిలైట్ హక్కులు కూడా ఏకంగా 14 కోట్లకు అమ్ముడై మెగాస్టార్ మేనియా ఇంకా తగ్గలేదని ప్రూవ్ చేసింది. మొత్తానికి చిరంజీవి సినిమాకు ఏకంగా వందకోట్ల వరకు బిజినెస్ జరిగిందని సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments