ఖైదీ 150 లో అమితాబ్ బచ్చన్ పాత్ర .. !!

Saturday, January 21st, 2017, 01:09:48 PM IST

chiru
మెగా స్టార్ చిరంజీవి తన ఖైదీ 150 వ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తన సినిమా ఇప్పటికే భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం తో ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూ లు ఇస్తున్న చిరంజీవి అమితాబ్ గురించి తాను అనుకున్న విషయాలు చెప్పుకొచ్చారు. తన 150వ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కు ఒక పాత్ర ఇవ్వాలని ముందు అనుకున్నామని… ఆ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నామని తెలిపారు. చిరంజీవి 150వ సినిమా తీస్తే అందులో అతిథి పాత్రలో నటించేందుకు తాను సిద్ధమంటూ అమితాబ్ చెప్పిన మాటను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. వాస్తవానికి తాను 150వ చిత్రం చేయడానికి అమితాబ్ ప్రోత్సాహం కూడా ఒక కారణమని చెప్పారు. 150వ చిత్రంలో అమితాబ్ లాంటి గొప్ప నటుడు నటించేందుకు సరైన పాత్ర లేదని చిరు తెలిపారు.