చరణ్ తో బాలీవుడ్ హీరోయిన్ చెట్టా పట్టాల్ ?

Thursday, September 27th, 2018, 02:14:28 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నంబర్ 12 చిత్రం యూరప్ లోని అజర్ బైజాన్ లో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 80 శతం పైగా షూటింగ్ పూర్తీ చేసుకున్న సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. రామ్ చరణ్ సరసన మహెష్ బాబు భరత్ అనే నేనుతో తెలుగు తెరకు పరిచయం అయిన బాలీవుడ్ హాట్ బాంబు ఖైరా అద్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ యాక్షన్ సన్నివేశాలతో పాటు సాంగ్స్ కూడా చిత్రీకరిస్తారట .. అందుకోసం హీరో హీరోయిన్స్ ఇద్దరు అక్కడే ఉన్నారు. సరదాగా షూటింగ్ గ్యాప్ లో ఖైరా రామ్ చరణ్ తో కలిసి ఆ టౌన్ లో షికార్లు చేస్తుందట. ప్రస్తుతం దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. రామ్ చరణ్ తో ఖైరా అద్వానీ చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతుందంటూ బాలీవుడ్ లో తెగ ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ కీ రోల్స్ పోషిస్తున్నారు .