నిమర్జనానికి రెడీ అవుతున్న భారీగణపతి

Monday, September 8th, 2014, 04:07:51 PM IST

ఖైరతాబాద్ కైలాస విశ్వరూప మహాగణపతి నిమర్జన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ముందుగా మండపంపైనున్న కర్రలను తొలగించాలి. ఈ పనులను గత రెండు రోజులుగా చేస్తున్నారు. ఈ పని దాదాపుగా పూర్తయింది. గణపతిని తరలించేందుకు భారీ క్రేన్ ఇప్పటికే ఖైరతాబాద్ చేరుకుంది. ముందుగా మహాగణపతికి ఇరువైపులా ఉన్న విగ్రహాలను తొలగిస్తారని, అనంతరం.. మహాగణపతి చేతిపై ఉన్న భారీ లడ్డూను తొలగిస్తారు. ఆ తరువాత గణపతిని మండపం నుంచి ఎత్తి భారీ క్రేన్ పై పెట్టె ఏర్పాట్లను చేస్తారు. ఇదంతా ఈ మధ్యాహ్నం నుంచి మొదలు పెడితే.. ఈ రాత్రి పది నుంచి 12 గంటల మధ్య పూర్తీ అవుతుంది. ఆ తరువాత మహాగణపతి నిమర్జన యాత్ర మొదలవుతుంది. అయితే, ట్యాంక్ బండ్ లో నిమర్జన కోసం వచ్చే వినాయకుల రద్దీని అనుసరించి ఈ భారీ వినాయకుడి నిమర్జనం ఆధారపడి ఉంటుందని నిర్వాహకులు తెలియజేస్తున్నారు.