వీడియో : కార్తీ ఎంత కష్టపడ్డాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Friday, November 10th, 2017, 07:27:08 PM IST

కోలీవుడ్ హీరో కార్తీ టాలీవుడ్ లో కూడా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే. కెరీర్ మొదట్లో యుగానికి ఒక్కడు – ఆవారా సినిమాలు కార్తీకి టాలీవుడ్ లో మంచి మార్కెట్ ని సెట్ చేసుకునేలా చేశాయి. ఆ తర్వాత కొన్ని సినిమాలతో కూడా కార్తీ పర్వాలేదు అనిపించాడు. అయితే కార్తీ తన లేటెస్ట్ మూవీ ఖాకి ని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ప్రమోషన్స్ ని కూడా బాగానే చేస్తున్నాడు.

తీరన్‌ అధిగారమ్‌ ఒండ్రు అనే తమిళ్ సినిమాకు ఖాకి అనువాదంగా వస్తోంది. నవంబర్‌ 17 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా సినిమాలోని మేకింగ్ వీడియో ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. సినిమాలో కార్తీ యాక్షన్ సన్నివేశాలు ప్రధాన బలం కావడంతో కార్తీ ఎంత కష్టపడ్డాడో చూపించారు. ప్రస్తుతం ఈ మేకింగ్ విడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి కార్తీకి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందిస్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments