ఖిల్జీ `ఖ‌లిబ‌లి` మేకింగ్ వీడియో వైర‌ల్

Sunday, February 18th, 2018, 10:20:54 PM IST

`ప‌ద్మావ‌త్‌` నాలుగో వారం, ఐదో వారంలోనూ బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా దాదాపు 260 కోట్లు వ‌సూలు చేసి, 300 కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టేందుకు వ‌డి వ‌డిగా అడుగులు వేస్తోంది. ఇలాంటి వేళ ఈ సినిమాలో ప‌లు కీల‌క ఎపిసోడ్ల మేకింగ్ వీడియోల్ని యూనిట్ రిలీజ్ చేస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా తాజాగా ఖిల్జీ పాత్ర‌ధారిపై తెర‌కెక్కించిన ఖ‌లిబ‌లి సాంగ్‌ని లాంచ్ చేశారు.

క్రూర‌త్వం నిండిన ఖిల్జీని ఎంతో స్పెష‌ల్‌గా ఆవిష్క‌రించిన ఈ పాట మేకింగ్ వీడియో ప్ర‌స్తుతం జోరుగా వైర‌ల్ అవుతోంది. ఖిల్జీ పాత్ర‌ధారి ర‌ణ‌వీర్ సింగ్ డెడికేష‌న్‌, హార్డ్‌వ‌ర్క్ ఎలాంటిదో ఈ మేకింగ్ వీడియో చూస్తే అర్థ‌మ‌వుతోంది. భ‌న్సాలీ అండ్ టీమ్ ఎంతో క్యూరియాసిటీతో ద‌గ్గ‌రుండి మ‌రీ ఈ పాట‌ను తెర‌కెక్కించారు. కొరియోగ్రాఫ‌ర్ గ‌ణేష్ ఆచార్య ప‌నిత‌నానికి ఈ పాట కొరియోగ్ర‌ఫీ ఓ ఎగ్జాంపుల్‌. ప‌ద్మావ‌త్‌లో ర‌ణ‌వీర్ సింగ్ న‌ట‌న‌కు జాతీయ అవార్డు ద‌క్కుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.