కపూర్ రిసెప్షన్ లో ఖాన్స్ చిందులు చూశారా..?

Wednesday, May 9th, 2018, 03:33:52 PM IST

బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ పెళ్లి ప్రియుడు ఆనంద్ ఆహుజాతో అంగరంగ వైభవంగా పూర్తయిపోయింది. మంగళవారం (మే 8) మధ్యాహ్నం పెళ్లి తంతు ముగిశాక సాయంత్రం రిసెప్షన్‌కు నూతన జంట సిద్ధమైంది. పెళ్లికి పెద్దగా బాలీవుడ్ నటీనటులు హాజరవ్వకపోయినా… రిసెప్షన్‌కు మాత్రం అందరూ విచ్చేశారు. రిసెప్షన్ లో డ్యాన్సులతో స్టేజీ దద్దరిల్లింది.

ఓ పక్క డీజే సాగుతుంటే సోనమ్ తండ్రి అనిల్ కపూర్ స్టేజీ మీద డ్యాన్స్ చేస్తూ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇక బాలీవుడ్ ఖాన్స్ షారూఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ రెచ్చిపోయి డ్యాన్సు వేశారు. సోనమ్ తల్లిని కాసేపు పాటలు పాడుతూ ఆటపట్టించారు. రణ్ వీర్ సింగ్ కూడా స్టేజీ అదిరిపోయేలా స్టెప్పులేశారు. షారూక్ సల్మాన్ కలిసి నటించిన సినిమా కరణ్ అర్జున్ సినిమాలోని పాటలు పాడుతూ అందరినీ నవ్వించారు. షారూఖ్ రణ్ వీర్ అనిల్ కపూర్ కలిసి కోయి మిల్ గయా పాటలకు డ్యాన్సు వేశారు. చివర్లో వధూవరులిద్దరూ కూడా ముజ్సే షాదీ కరోగీ పాటలకు బాలీవుడ్ హీరోలతో కలిసి స్టెప్పులేశారు. రిసెప్షన్ పార్టీ ఆటపాటలతో సందడిగా మారిపోయింది.

సోనమ్‌కు ఆనంద్ ఆహూజా మూడేళ్లకు పైగా పరిచయం ఉంది. ఢిల్లీకి చెందిన బిజినెస్ మ్యాన్ ఆనంద్ తో సోనమ్ ప్రేమకు ఇరువైపులా తల్లిదండ్రులు ఓకే చెప్పారు. పెద్దల సమక్షంలోనే పెళ్లి పీటలెక్కింది ప్రేమజంట. రెండు రోజుల పాటూ సోనమ్ సినిమాలకు సెలవుచెప్పింది. ఆ తరువాత వెంటనే వీర్ ది వెడ్డింగ్ సినిమా ప్రమోషన్ లో పాల్గొంటుంది. ఆ తరువాత మే చివరిలోనో లేక జూన్ లోనో కొత్త జంట హనీమూన్ కు వెళ్లే అవకాశం ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments