పవన్ స్థాయి ఏంటి..కాంగ్రెస్ పెద్దలు కన్నెర్ర

Wednesday, September 18th, 2019, 07:11:46 PM IST

మొన్న సోమవారం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “సేవ్ నల్లమల” అంటూ యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అఖిల పక్ష భేటీ నిర్వహించాడు. దీనికి కాంగ్రెస్ నేతలు ఎక్కువగానే హాజరయ్యారు. అక్కడికి వెళ్ళటం వలన వచ్చిన లాభం ఏమిటో తెలియదు కానీ, అలా వెళ్లినందుకు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు అక్షింతలు వేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా దీనిపై గట్టిగానే నేతలకి క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అసలు ఎవరు..? అతని స్థాయి ఏమిటి..? ఆయన పార్టీకి తెలంగాణలో ఉన్న విలువేంటి..? ఆయన పిలిస్తే మీరెందుకు వెళ్లారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తుంది. కేవలం ఆంధ్రాలో సింగిల్ డిజిట్ ఓట్లు మాత్రమే అతనికి వచ్చాయి. తెలంగాణలో అది కూడా లేదు. అలాంటిది అతను మీటింగ్ అని పిలవగానే ఎందుకు వెళ్లారు.

ఆ పార్టీతో పోల్చి చూస్తే మన పార్టీనే తెలంగాణ లో మంచి స్థాయిలో ఉంది. మన కంటే కింద స్థాయి పార్టీ వాళ్ళు పిలిస్తే వెళ్ళటం కరెక్ట్ కాదు, మన కిందకి వచ్చి పవన్ కళ్యాణ్ పనిచేస్తే ఆ విధానం వేరుగా ఉంటుంది. అలా కాకుండా మీరు పవన్ కిందకి వెళ్ళటం ఏంటి అంటూ మీటింగ్ కి వెళ్లిన నేతలపై కుంతియా సీరియస్ అయినట్లు తెలుస్తుంది.