ముంబైలో కియ‌రా క‌ల‌క‌లం

Thursday, August 9th, 2018, 01:41:12 PM IST

భ‌ర‌త్ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌లో ప్ర‌వేశించింది కియ‌రా అద్వాణీ. ఆ సినిమా బాక్సాఫీస్వ వ‌ద్ద బంతాడేసింది. ఆరంగేట్ర‌మే అంత పెద్ద సూప‌ర్‌స్టార్ స‌ర‌స‌న ఛాన్స్ కొట్టేసిందిక్క‌డ‌. అటు బాలీవుడ్‌లోనూ ఎం.ఎస్‌.ధోని లాంటి క్రేజీ సినిమాతో గుండె కొల్ల‌గొట్టింది. కియ‌రా అంద‌చందాల‌కు యూత్ స్పెల్ బౌండ్ అయిపోయారు. హిట్టు మీద హిట్టొస్తే ఎవ‌రికైనా ఎలా ఉంటుంది? ఆ హిట్టు కిక్కిస్తుంది. దాంతో పాటే కాన్ఫిడెన్స్ పెంచుతుంది. ఇప్పుడు అదే స్పీడ్‌ని కియ‌రా వీలున్న ప్ర‌తి సంద‌ర్భంలోనూ చూపిస్తోంది.

నిన్న‌టి సాయంత్రం ఓ ఫ్యాష‌న్ షోలో కియ‌రా ఇచ్చిన ఫోజులు కుర్ర‌కారుకు కంటిపై కునుకు ప‌ట్ట‌నీకుండా చేశాయి. సూదంటు చూపుల‌తో గుండెల్లో గుచ్చేసింది. ఈ దెబ్బ‌కు ముంబైలో కియ‌రా ప్ర‌కంప‌నాలు షురూ అయిన‌ట్టే. ఒక ర‌కంగా కియ‌రా ర్యాంప్‌పైకి వ‌స్తే క‌ల‌క‌ల‌మే క‌నిపిస్తోంది. చూపుల‌న్నీ అటే లాక్కుపోతున్నాయ్‌. క‌త్రిన‌, క‌రీనా, ఆలియా .. వీళ్లంద‌రికీ ఇక కియ‌రా రూపంలో థ్రెట్ త‌ప్పేట్టు లేదు. మునుముందు దీపిక లాంటి అంద‌గ‌త్తెకే పోటీకెళ్లేట్టే క‌నిపిస్తోంది వ్య‌వ‌హారం. త‌దుప‌రి చ‌ర‌ణ్‌తో సినిమా, కిలాడీ అక్ష‌య్‌తో సినిమా.. ఇలా లైన‌ప్ చూస్తే ఓ రేంజులో ఉంది. అందుకే కియ‌రా న‌వ్ స్టార్ హీరోయిన్.. ఇట్ ఈజ్‌ డిక్లేర్డ్‌!!

#kiaraadvani for @onlyindia @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

  •  
  •  
  •  
  •  

Comments