ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచేస్తాం!

Wednesday, September 17th, 2014, 01:54:32 AM IST


కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం విజయవాడలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచి వేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని నిరుపిస్తామని వెంకయ్య తెలిపారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ మావోయిస్టులు తుపాకీ తూటాలతో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పలేరనే విషయం గుర్తించాలని సూచించారు. అలాగే ప్రజల సహకారంతో అభివృద్ధి సాధ్యమని, ప్రజలకు, ప్రభుత్వానికి పార్టీ కార్యకర్తలు వారధిలా ఉండాలని వెంకయ్య పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో భాజపా పటిష్టం అవ్వాలంటే కార్యకర్తలు అంకిత భావంతో పనిచెయ్యాలని వెంకయ్య నాయుడు హితబోధ చేశారు.