`అవెంజ‌ర్స్‌-3`లో కింగ్‌ఖాన్!

Friday, September 14th, 2018, 06:45:56 PM IST

కింగ్ ఖాన్ షారూక్ స్టామినా గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. అత‌డు తెర‌పై క‌నిపిస్తే చాలు కాసుల కుంభ‌వృష్టి కుర‌వాల్సిందే. అయితే గ‌త కొంత‌కాలంగా ఖాన్‌ కెరీర్ ప‌రంగా త‌డ‌బ‌డ్డాడు. ఆ క్ర‌మంలోనే `జీరో` సినిమాతో భారీ ప్ర‌యోగం చేస్తున్నాడు. ఇందులో మ‌రుగుజ్జు పాత్ర‌లో న‌టిస్తున్నాడు. షారూక్‌ ఖాన్ ఎట్టి ప‌రిస్థితిలో త‌న పూర్వ వైభ‌వాన్ని తిరిగి తెచ్చుకునేందుకు చాలానే శ్ర‌మిస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లోనే జీరో చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.

ఈలోగానే ఖాన్‌కు సంబంధించిన ఓ అదిరిపోయే అప్‌డేట్ అందింది. కింగ్ ఖాన్ షారూక్ ప్ర‌ఖ్యాత మార్వ‌ల్ సంస్థ నిర్మిస్తున్న `అవెంజ‌ర్స్ -3`లో న‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు మార్వ‌ల్ సంస్థ క్రియేటివ్ హెడ్ స్టీఫెన్ వాక‌ర్ ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర సంగ‌తిని రివీల్ చేశాడు. ఇండియాలో మార్వ‌ల్ సంస్థ త‌మ వ‌సూళ్ల‌ బ‌లం పెంచుకునేందుకు ప్ర‌ణాళిక‌ల్లో ఉంది. ఇక్క‌డ మార్కెట్‌ని కొల్ల‌గొట్టాలంటే అందుకు ఏం చేయాలో అధ్య‌యనం చేసింది. భార‌త‌దేశంలో స్థానిక హీరోలు ఎవ‌రైనా న‌టిస్తే ఆ సినిమాల‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తారు. అందుకే మార్వ‌ల్ తెర‌కెక్కించే త‌దుప‌రి సూప‌ర్ హీరో చిత్రం `అవెంజ‌ర్స్ 3`లో కింగ్ ఖాన్ షారూక్‌ని ఎంపిక చేసుకునే ఆలోచ‌న‌ల్లో ఉన్నామ‌ని వాక‌ర్ తెలిపారు. ఈ వార్త‌తో ఖాన్ అభిమానుల్లో ఒక‌టే ఆస‌క్తి మొద‌లైంది. అవెంజ‌ర్స్ 2 చిత్రంలో అంద‌రు సూప‌ర్‌హీరోలు తెర‌పై క‌నిపించి సంద‌డి చేశారు. ఇప్పుడు వాళ్ల‌తో పాటు షారూక్‌ని అభిమానులు సూప‌ర్‌హీరోగా వీక్షించే అవ‌కాశం ఉంది. షారూక్‌ని మార్వ‌ల్ సంస్థ ఎంపిక చేసుకోవ‌డానికి కార‌ణం అత‌డు న‌టించిన `రా-వ‌న్‌` న‌చ్చ‌డం వ‌ల్ల‌నే. అందులో షారూక్ సూప‌ర్‌హీరోగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక భార‌త‌దేశంలో అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన స్టార్‌గానూ షారూక్ స్టామినాని మార్వ‌ల్ క్యాష్ చేసుకోవాల‌ని ప్లాన్ చేసింది. ఏదైతేనేం ఇది కింగ్ ఖాన్ అభిమానులకు గొప్ప శుభ‌వార్త అనే చెప్పాలి. అత‌డి ఇమేజ్ హాలీవుడ్ వినువీధుల్లోకి విస్త‌రించ‌డం ఆహ్వానించద‌గిన ప‌రిణామ‌మే. 2018లో మార్వ‌ల్ తెర‌కెక్కించిన సూప‌ర్‌హీరో సినిమాల‌న్నీ ఇండియాలో భారీ విజ‌యం సాధించి వంద‌ల కోట్ల సంప‌ద‌ల్ని కొల్ల‌గొట్టిన సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments