కింగ్‌ఖాన్ టీజ‌ర్‌తో ఝ‌ల‌కిస్తాడ‌ట‌!

Wednesday, June 13th, 2018, 12:29:13 PM IST

కింగ్‌ఖాన్ షారూక్ – ఆనంద్.ఎల్‌.రాయ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ప్ర‌తిష్ఠాత్మక చిత్రం జీరో డిసెంబ‌ర్‌లో రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. ఇదివ‌ర‌కూ రిలీజ్ చేసిన టీజ‌ర్‌కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానుల‌నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. జీరో బాద్‌షా కెరీర్ బెస్ట్ సినిమా అవుతుంద‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. జీరో టీజ‌ర్‌లో ఖాన్ అద్భుత న‌ట ప్ర‌ద‌ర్శ‌న చూడ‌బోతున్నామ‌ని అభిమానులు భావిస్తున్నారు.

ఇక తొలి టీజ‌ర్‌ని మించి రెండో టీజ‌ర్‌లో అదిరిపోయే గ్లింప్స్‌ని వ‌దులుతున్నాడు బాద్‌షా. ఈ ఈద్ కానుక‌గా రిలీజ్ చేయ‌నున్న టీజ‌ర్‌లో కండ‌ల హీరో స‌ల్మాన్‌తో క‌లిసి తాను క‌నిపించే ఫ్రేమ్‌ని రెడీ చేస్తున్నాడ‌ట‌. ఈ టీజ‌ర్‌లో కండ‌ల హీరో స‌ల్మాన్‌ఖాన్ అదిరిపోయే ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. స‌ల్మాన్ – షారూక్ ఇద్ద‌రినీ ఒకే ఫ్రేమ్‌లో అభిమానులు వీక్షించే ఛాన్సుందిట‌. అనుష్క శ‌ర్మ, క‌త్రిన‌కైఫ్ ఈ చిత్రంలో క‌థానాయిక‌లు. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 21 ఈ చిత్రం రిలీజ్ చేయ‌నున్నారు. ఆర్‌.మాధ‌వ‌న్‌, ఆలియాభ‌ట్, శ్రీ‌దేవి, క‌రిష్మా క‌పూర్‌, కాజోల్ వంటి స్టార్లు ఈ చిత్రంలో అతిధులుగా క‌నిపించనున్నారు. బాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ చిత్రం ఈ ఏడాది ఎండింగ్‌లో బాక్సాఫీస్‌ని ఊపేస్తుంద‌ని చెబుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments