ఆ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకున్నానంటున్న షారుఖ్ భార్య !

Thursday, March 1st, 2018, 03:26:04 PM IST

కింగ్ ఖాన్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు రాక పూర్వం కొన్ని ధారావాహికల్లో నటించిన విషయం తెలిసిందే. అయితే తరువాత షారుక్‌ సినిమాల్లో ప్రయత్నాలు చేసారు.ఆ సమయంలో షారుక్‌కి కొత్తగా వివాహం అప్పుడే గౌరీ తో వివాహం జరిగింది. వివాహానంతరం ఆయనకు తొలి చిత్రం దీవానా చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. కింగ్‌ ఖాన్‌ కెరీర్‌లో తొలి సినిమా ఇదే. అయితే వివాహానంతరం వారిరువురు మకాం ఢిల్లీ నుంచి ముంబయికి మార్చారు. అయితే దీవానా చిత్రీకరణ సమయంలో షారుక్‌ సతీమణి గౌరీ ఖాన్‌ సినిమా ఫ్లాపవ్వాలని దేవుడిని ప్రార్థించారట.

అయితే ప్రస్తుతం ఈ విషయాన్ని షారుక్‌ స్నేహితుడు, బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ సమయంలో గౌరీఖాన్‌ అలా ఎందుకు కోరుకున్నారంటే, తనకు ఢిల్లీ వదిలి ముంబయికి రావడం ఇష్టంలేదట . సినిమా కనుక ఫ్లాపైతే షారుక్‌ సినిమాలు వదిలేస్తారని ఆ తర్వాత తిరిగి హాయిగా ఢిల్లీ వెళ్లిపోవచ్చని గౌరీ అనుకున్నారట. ఈ విషయాన్ని గౌరీ కూడా ఒకానొక సమయంలో వెల్లడించారు. ఆమెకు ఇంటీరియర్‌ డిజైనింగ్‌ అంటే చాలా ఇష్టం. బాలీవుడ్‌ సెలబ్రిటీలు తమ ఇళ్ల డిజైనింగ్‌కు గౌరీనే ఎంపిక చేసుకుంతుంటారు కూడా. గౌరీకి అసలు తనకు సినిమాలంటే ఇష్టం లేదని , కానీ షారుక్‌ తన జీవితంలోకి వచ్చాక సినిమాలపై ఆసక్తి కలిగిందని తెలిపారు…