50 హాఫ్ సెంచరీలతో “కింగ్ కోహ్లీ” ఆ రికార్డును అందుకున్నాడా?

Monday, June 10th, 2019, 03:33:30 PM IST

ప్రస్తుతం 2019 ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే.అందులో భాగంగా నిన్ననే భారత్ మరియు ఆస్ట్రేలియా జట్ల జరిగిన మొదటి మ్యాచ్ లో మన జట్టు భారీ లక్ష్యాన్ని వారి ముందు ఉంచి అద్భుత విజయాన్ని కైవసం చేసుకున్నారు.శిఖర్ ధావన్ సెంచరీతో రెచ్చిపోగా రోహిత్ మరియు రన్ మెషిన్ కింగ్ కోహ్లీ లు హాఫ్ సెంచరీలు నమోదు చేసుకున్నారు.అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో కోహ్లీ చేసిన హాఫ్ సెంచరీతో వన్డే సిరీస్ లో 50 అర్ధ శతకాలను నమోదు చేసుకున్న క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇప్పటి వరకు కోహ్లీ మొత్తం 50 హాఫ్ సెంచరీలు నమోదు చేయగా 41 సెంచరీలే ఉన్నాయి.కొహ్లీ కు ముందు చాలా మందే ఉన్నా సరే ఈ ఫీట్ ను కోహ్లీ చాలా త్వరగా అందుకున్నాడనే చెప్పాలి.అయితే ప్రస్తుతానికి అయితే కోహ్లీ అత్యధిక అర్ధ శతకాలు పూర్తి చేసిన క్రికెటర్ గా ఇంకా టాప్ 10 లోకి రాలేదు.కోహ్లీకి ముందు వరుసలో చాలా మందే ఉన్నారు.

1) సచిన్ టెండూల్కర్ – భారత్ – 96
2) కుమార సంగక్కర – శ్రీలంక – 93
3) జాక్వస్ కల్లిస్ – దక్షిణాఫ్రికా – 86
4) రాహుల్ ద్రావిడ్ – భారత్ – 83
5) ఇంజమామ్-ఉల్-హక్ – పాక్ – 83
6) రికీ పాంటింగ్ – ఆస్ట్రేలియా – 82
7) సౌరవ్ గంగూలీ – భారత్ – 72
8) సనత్ జయసూర్య – శ్రీలంక – 68
9) మహేలా జయవర్దనే – శ్రీలంక – 68
10) బ్రెయిన్ లారా – వెస్టిండీస్ – 63

ఇంకా కోహ్లీ టాప్ 10లో చేరాలి అంటే ఇంకో 13అర్ధ శతకాలను తన ఖాతాలో వేసుకోవాలి.మరి ఈ రికార్డును కోహ్లీ ఎప్పుడు అందుకుంటాడో చూడాలి.