నాగార్జున ఒప్పుకోవ‌డం క‌ష్ట‌మే అంటున్నారు!

Friday, September 30th, 2016, 06:01:14 PM IST

nagarjuna
ప్ర‌యోగాల‌కి వెన‌కాడ‌ని క‌థానాయ‌కుడు నాగార్జున‌.ఎన్నో వైవిధ్య‌మైన చిత్రాలు చేశారాయ‌న‌. అయితే ఆయ‌న చేసే సినిమాలు అంద‌రికీ ప్ర‌యోగం అని పిస్తుండొచ్చు కానీ..నాగ్ మాత్రం ఒక ప్ర‌యోగం చేయాల‌నుకొని మాత్రం తాను సినిమా చేయ‌న‌ని చెబుతుంటాడు. ఆక‌ట్టుకొనే క‌మ‌ర్షియ‌ల్ పాయింట్ఉ న్న‌ప్పుడే సినిమా చేస్తాన‌ని, ప్ర‌యోగం కోసం నేనెందుకు సినిమా చేయాల‌ని చెబుతుంటాడు. ఆ థృక్ప‌థంవ‌ల్లేనేమో ఆయ‌న ప్ర‌యోగాలు చేసినా అవి ఘ‌న విజ‌యం సాధిస్తుంటాయి. `గీతాంజ‌లి` మొద‌లుకొని `శివ‌`, `అన్న‌మ‌య్య‌`తో పాటు మొన్న‌టి `ఊపిరి` వ‌ర‌కు అంతే. అంద‌రి దృష్టిలో ఇవి ప్ర‌యోగాలే. కానీ నాగ్‌కి మాత్రం విజ‌యాల్ని అందించాయి. అందుకే కొత్త క‌థ అన‌గానే ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆయ‌న ద‌గ్గ‌రికే వెళుతుంటారు.ఒప్ప‌మ్రీ మేక్ తెర‌పై కొచ్చింది.మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన చిత్రం ఒప్ప‌మ్‌. ఒక అంధుడి పాత్ర‌తో తెర‌కెక్కింది. మోహ‌న్‌లాల్ క‌థానాయ‌కుడి గా న‌టించారు. ఆ చిత్రం రీమేక్‌ రైట్స్ తెలుగు నిర్మాత‌లు సొంతం చేసుకొన్నారు.దాన్ని నాగ్‌తో తెర‌కె క్కించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.అయితే ఈమ‌ధ్యే `ఊపిరి`లో వీల్‌చైర్‌కి ప‌రిమిత‌మైన వ్య‌క్తి పాత్ర‌లో క‌నిపించాడు. మ‌ళ్లీ ఇప్పుడు అంధుడిగా క‌నిపిస్తే ఆ త‌ర‌హా క‌థ‌ల‌తోనే త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చే ప్ర‌మాద‌ముంద‌ని నాగ్భ‌ య‌ప‌డుతున్నాడ‌ట‌. అందుకే ఒప్ప‌మ్ రీమేక్‌కి ఆయ‌న ఒప్పుకోవ‌డం క‌ష్ట‌మే అన్న‌పూర్ణకాంపౌండ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.