ప్రీమియర్ షో టాక్ : కిర్రాక్ పార్టీ.. ఎలా ఉందంటే!

Friday, March 16th, 2018, 03:31:57 AM IST

స్వామి రారా సినిమా నుంచి కథలపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న హీరో నిఖిల్ వరుస విజయాలను చూస్తున్నాడు. ఎక్కడా తగ్గకుండా తనదైన శైలిలో తన బాక్స్ ఆఫీస్ మార్కెట్ ను కూడా పెంచుకుంటున్నాడు. గత ఏడాది కేశవ సినిమాతో పరవాలేదు అనిపించిన నిఖిల్ చాలా గ్యాప్ తీసుకొని కిర్రాక్ పార్టీ అనే కాలేజ్ స్టోరీతో వచ్చాడు. ఈ సినిమా శుక్రవారం ఇండియాలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే అమెరికాలో ముందే సినిమా ప్రీమియర్స్ ను ప్రదర్శించారు.

నిఖిల్ తన కెరీర్ లో మొన్నటి వరకు కొంచెం డిఫెరెంట్ సినిమాలను చేశాడు. యాక్షన్ అంశాలు ఉండేట్లు కూడా జాగ్రత్త పడ్డాడు. ఈ సినిమా కాలేజ్ క్యాంపస్ డ్రామా తరహాలో సాగుతుంది. కన్నడలో ఈ కథ పెద్ద హిట్ అయ్యింది. అయితే తెలుగులో మాత్రం బారి మార్పులే చేశారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచుకి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే లో అలాగే సన్నివేశాల్లో కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ అందరిని ఆకట్టుకున్నాయి. కానీ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ రోటిన్ గా అనిపిస్తాయి. కామెడీ సన్నివేశాలు పరవాలేదు అని చెప్పవచ్చు. మెయిన్ గా నిఖిల్ తన టైమింగ్ నటనతో చాలా ఆకట్టుకున్నాడు. ఎమోషన్స్ కి తగ్గట్టు డైలాగులు చెప్పిన విధానం బాగుంది.ముఖ్యంగా క్లైమాక్స్ లో అద్భుతంగా నటించాడు. హీరోయిన్ సంయుక్త హెగ్డే రష్మిక మందనా వారి పాత్రలకు న్యాయం చేశారు. సంగీతపరంగా సినిమా సరైన అంచనాలను అందుకోదు. కెమెరా పనితనం నిర్మాణ విలువలు సినిమాకు ప్లస్ పాయింట్. మరి సినిమా అన్ని వర్గాల వారికి నచ్చుతుందో లేదో చూడాలి.