చిరంజీవి కి వార్నింగ్ ఇచ్చిన క్రిష్ ? ఎంతవరకూ నిజం ?

Wednesday, December 28th, 2016, 12:17:42 PM IST

krish
బాలకృష్ణ – క్రిష్ ల కాంబినేషన్ లో వస్తున్న గౌతమీ పుత్ర శాతకర్ణి ఆడియో లాంచ్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఆడియో వేడుకలో అందరి స్పీచ్ లనీ తలదన్నే రేంజ్ లో డైరెక్టర్ క్రిష్ మాట్లాడారు. బాలకృష్ణ తప్ప శాతకర్ణి రోల్ కి ఎవ్వరూ సెట్ అయ్యే ఛాన్స్ లేదు అని చెప్పిన డైరెక్టర్ క్రిష్ ఈ శాతకర్ణి జీవితం గురించి తాను ఫుల్ గా స్టడీ చేసాను అని చెప్పుకొచ్చారు. ఆ కథ చదువుతున్నప్పుడు తన రక్తం మరిగింది అన్నారు క్రిష్. ఆయన చెప్పిన స్పీచ్ అందరినీ ఆకట్టుకోగా ఆఖర్లో ఇచ్చిన ఖబడ్దార్ వార్నింగ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. అసలు క్రిష్ ఈ వార్నింగ్ ఎవరికిచ్చాడంటూ రచ్చ మొదలైంది. చిరు ఖైదీ 150 విడుదల సందర్భంగా క్రిష్ ఈ వార్నింగ్ ఇచ్చారు అంటూ కొందరు ఔత్సాహికులు పుకార్లు లేపారు. అంతేకాక ఖైదీ నెంబర్ 150 టీజర్లో ఇచ్చిన స్వీట్ వార్నింగ్ ని తమకి రిలేట్ చేసుకుని ఇది దానికి కౌంటర్ అంటూ బటర్ ఫ్లై ఎఫెక్ట్ టెక్నీక్ వాడారు. ఇందులో ఏమాత్రం నిజం వుందో తెలీదుగానీ వెంటనే క్రిష్ స్పందించడం విశేషం. తనకు బన్నీ – వరుణ్ తో మంచి బాండింగ్ వుందని చరణ్ తో ఎప్పట్నుంచో స్నేహం వుందని తన ప్రతీ ఎదుగుదలలో మెగాస్టార్ చిరంజీవి ప్రోత్సాహంవుందని మెగా ఫామిలీకి ఆ డైలాగ్ కి ఏ మాత్రం సంబంధంలేదని తెలుగు జాతి చరిత్రని మరిచిపోయిన తెలుగువాళ్ళకు సవాల్ అని స్పష్టంచేశాడు.