అమరవీరులకు గుర్తింపు లేదా..?

Tuesday, September 16th, 2014, 01:05:52 PM IST


అమరవీరుల త్యాగాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి అన్నారు.
తెలంగాణ బీజేపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. కీసీఆర్ తన వైఖరిని మార్చుకోవాలని ఆయన అన్నారు. అమరవీరుల త్యాగాల వలెనే తెలంగాణ వచ్చిందని ఆయన తెలిపారు. అమరవీరుల కుటుంబాలను తెరాస ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. మెదక్ ఎన్నికలపై పెట్టిన దృష్టి ప్రజల సమస్యలపై పెడితే రాష్ట్రం బాగుపడుతుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోవాలని అన్నారు. రైతు ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.