క్యూలో నించోబెట్టి చంపుతారా?

Friday, October 17th, 2014, 09:01:15 AM IST

kishan-reddy
తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గురువారం అంబర్ పేటలో దరఖాస్తు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పధకాలను నీరుగార్చేందుకే తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని విమర్శించారు. అలాగే తెలంగాణ సర్కారు ఫించన్ల కోసం కొత్త దరఖాస్తులను ప్రజల నుండి ఎందుకు తీసుకుంటోందో స్పష్టం చెయ్యాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ఫించన్ల కోసం ప్రస్తుతం ఉన్న రికార్డుల బట్టి తనిఖీ చేస్తే సరిపోతుందని, బంగారు తెలంగాణ అంటే ప్రజలను క్యూలో నించోబెట్టి చంపడమా? అంటూ నిలదీశారు. అలాగే తెలంగాణ నేతలు కరెంటు విషయంలో చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.ఇక కేంద్రం సహాయం చేస్తామన్నా తీసుకునే స్థితిలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేరని, అసెంబ్లీ సమవేశాలు నిర్వహించే ఉద్దేశ్యం ముఖ్యమంత్రికి ఏమాత్రం లేదని కిషన్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు.