తెలంగాణకు, పీఎం కేర్ ఫండ్‌కి భారీ విరాళం ప్రకటించిన కిషన్ రెడ్డి..!

Thursday, April 2nd, 2020, 02:40:41 AM IST

దేశవ్యాప్తంగా రోజు రోజుకు కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో కరోనాను కట్తడి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి భారీ విరాళాన్ని ప్రకటించారు.

అయితే పీఎం కేర్స్ ఫండ్‌కి కోటి రూపాయల విరాళం తో పాటుగా ఒక నెల వేతనాన్ని ఇస్తున్నట్టు ప్రకటించాడు. 2020-21 సంవత్సరానికి సంబంధించి తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి కోటి రూపాయలు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఇకపోతే తెలంగాణ సీఎం సహాయ నిధికి 50 లక్షలు, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి 50 లక్షల రూపాయలు కరోనా పునరావాస కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నట్టు ప్రకటించాడు.