తెలంగాణ‌లో బీజేపీ మిష‌న్ కిష‌న్‌రెడ్డి స్టార్ట్ !

Saturday, June 1st, 2019, 02:38:50 PM IST

తెలంగాణ‌లో మాకు ప్ర‌త్యామ్న‌య‌మే లేదు ఇది తెరాస గ‌త ఐదేళ్లుగా వినిపిస్తున్న మాట‌. కానీ కాలం మారింది. తెరాస‌కు ప్ర‌త్య‌మ్న‌యం సిద్ధ‌మ‌వుతోంది. తెలంగాణ‌లో తెరాస‌కు ప్ర‌త్య‌మ్న‌యంగా బీజేపీని సిద్ధం చేస్తున్నారు అన‌డం కంటే తెరాస‌నే బీజేపీని సిద్ధం చేస్తోంది అన‌డం క‌రెక్టేమో. తెరాస అధినాయ‌క‌త్వం అతి విశ్వాసం, తెలంగాణ‌కు మేమే అన్న అహ‌మే బీజేపీ ఎదుగుద‌ల‌కు బాట‌లు వేస్తోంది. రాష్ట్రంలో ప్ర‌శ్నించే ప్ర‌తిప‌క్షం వుండొద్ద‌నే అత్యుత్సాహం, స‌మ‌స్య‌ల‌పై త్వ‌ర‌త‌గ‌తిన స్పందించ‌క‌పోవ‌డం, తెలంగాణ‌లో స‌ర్వం మేమే అన్న భావ‌న తెరాస శ్రేణుల్లో న‌ర‌న‌రాన జీర్ణించుకుపోవ‌డం వంటి బ‌ల‌మైన కార‌ణాల వ‌ల్ల చాలా మంది తెరాస అభిమానులు బీజేపీ వైపు మ‌ళ్ల‌డం మొద‌లైంది.

గ‌తంలో బీజేపీ సికింద్రాబాద్‌లో త‌ప్ప తెలంగాణ‌లో ఎక్క‌డా ఖాతా తెర‌వ‌లేదు. కానీ ఈ ద‌ఫా క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్ జిల్లాల్లో పాగా వేసింది. తెరాస‌కు కంచుకోట లాంటి క‌రీంన‌గ‌ర్‌లో బీజేపీ అభ్య‌ర్థి బండి సంజ‌య్ ఎంపీగా అత్య‌ధిక మెజారిటీతో గెలుపొంద‌డం ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేవ‌లం ఒక్క స్థానంతోనే స‌రిపెట్టుకునే బీజేపీ ఏకంగా ఈ ఎన్నిక‌ల్లో నాలుగు ఎంపీ స్థానాల్ని గెలుచుకోవ‌డం తెరాస శిబిరంలో క‌ల‌వ‌రాన్ని క‌లిగిస్తోంది. దీనికి తోడు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కిష‌న్ రెడ్డికి హోమ్ మంత్రిత్వ శాఖ స‌హాయ మంత్రిగా బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో తెలంగాణ‌లో బీజేపీకి మ‌రింత బ‌లాన్ని చేకూర్చిన‌ట్ల‌యింది. ఈ ఉత్సాహంతో తెలంగాణ‌లో తెరాస‌కు ధీటుగా బీజేపీని ప్ర‌త్య‌మ్న‌మ శ‌క్తిగా తీర్చిదిద్దుతాడ‌నండంలో ఎలాంటి అతిశ‌యోక్తిలేదు. తెరాస జాగ్ర‌త్త‌ప‌డ‌క‌పోతే కిష‌న్ రెడ్డి రూపంలో తెరాస‌కు త్రెట్టు ఖ‌యమే.