ఏపీ పోలీసులపై కేంద్రం దర్యాప్తు ?…కేంద్ర హోం కీలక ప్రకటన

Wednesday, September 18th, 2019, 04:17:45 PM IST

ఆంధ్రప్రదేశ్ లో పోలీసు శాఖ మొత్తం వైసీపీ పార్టీకి సరెండర్ అయిపోయి డ్యూటీ చేస్తుందని, ఏకంగా డీజేపీ కూడా అధికారాలు మొత్తం విజయసాయికి ఇచ్చాడని, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నాశనం అవుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు ఎప్పటినుండో విమర్శిస్తున్నారు. తాజాగా దీనిపై కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి పిర్యాదు చేశారు. కోడెల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు, ఆయన మీద కనీసం ప్రాథమిక ఆధారాలు లేకుండా నమోదు చేసిన కేసుల గురించి అన్ని ఆధారాలు కిషన్ రెడ్డికి ఇచ్చారు.

దీనిపై స్పదించిన కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ పోలీసుల తీరుపై.. తమకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. అలాగే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా… ఫిర్యాదులు అందాయన్నారు. పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. అవసరం అయితే దీనిపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చెప్పించటానికి అయిన సిద్ధంగా ఉన్నాను. దీనిపై రాష్ట్ర పోలీస్ శాఖ నుండి వివరణ అడిగిన తర్వాత దానిని బట్టి అమిత్ షాతో మాట్లాడి ఎలాంటి చర్య తీసుకోవాలి అనే దాని గురించి ఆలోచిస్తామని చెప్పాడు.

కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు గమనిస్తే వైసీపీకి గట్టి హెచ్చరికనే జారీచేసినట్లు ఉంది. నిజానికి జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పట్ల బీజేపీ అగ్ర నాయకత్వం అసహనంతో ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు రావటంతో దానిని బీజేపీ మంచి అవకాశంగా మలుచుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం తెలుగు రెండు రాష్ట్రాలకి సంబంధించిన అన్ని విషయాలు కిషన్ రెడ్డి చూసుకుంటున్నాడు. ఆయన ఏమి చెపితే అదే చెల్లుతుంది ఇక్కడ, అలాంటి కిషన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయటంతో ఏపీలో రాజకీయ వేడి అనేది మరోస్థాయికి చేరుకుంది.