టీ20ల్లో ఫస్ట్ కేఎల్ రాహులే..

Tuesday, March 13th, 2018, 01:02:45 PM IST

శ్రీలంకలో జరుగుతోన్న ముక్కోణపు టీ 20 సిరీస్‌ల్లో ఎవరు ఊహించని విధంగా భారత క్రికెట్ ఔటవ్వడం హాట్ టాపిక్ గా మారింది. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన కీపర్ కేఎల్.రాహుల్ హిట్ వికెట్ గా అవుటయ్యాడు. దీంతో భారత క్రికెట్ చరిత్రలో పొట్టి ఫార్మాట్ టీ20లలో హిట్ వికెట్ గా నిలిచినా మొదటి క్రికెటర్ గా రాహుల్ నిలిచాడు. జీవన్ మెండిస్ వేసిన బంతిను రాహుల్ లెగ్ సైడ్ ఆడబోయి కాలును వెనక్కి పోనిచ్చాడు. దీంతో వికెట్స్ కి టచ్ అవ్వడంతో బెయిల్స్ కింద పడ్డాయి. మొదట బౌలర్ కూడా పట్టించుకోలేదు. ఆ తరువాత ఫీల్డర్లు హ్యాపీగా ముందుకు రావడంతో రాహుల్ అవుటయినట్లు తేలింది. వన్డేల్లో ఈ తరహాలో అవుట్ అయిన వారిలో నలుగురు క్రికెటర్స్ ( నయాన్‌ మోంగియా – కుంబ్లే – సచిన్‌ టెండూల్కర్‌ – విరాట్‌ కోహ్లి) ఉన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments