బిగ్ బ్రేకింగ్ : సంచలనంగా మారనున్న కొడాలి నాని రేపిన చిచ్చు!!

Sunday, November 17th, 2019, 08:02:56 PM IST

ఇప్పుడు ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కిపోయేలా ఉన్నాయని చెప్పాలి.గత కొన్ని రోజుల క్రితం వరకు కూడా జనసేన వర్సెస్ వైసీపీ పాలిటిక్స్ హీటెక్కిస్తే ఇప్పుడు దానికి పదింతలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.తాజాగా తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ తీసుకుంటున్న నిర్ణయాల మీద కానీ విధివిధానాల మీద కానీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే అయితే వీరికి కౌంటర్లుగా మాత్రం వైసీపీ పవర్ ఫుల్ నేత కొడాలి నాని రెచ్చిపోతున్నారు.

మామూలుగానే నాని మైక్ ముందు మాట్లాడితే అవతల ఎవరొకరికి అయ్యిపోయిందన్న సంగతి తెలిసిందే.కానీ ఇప్పుడు మాట్లాడిన మాటలు మాత్రం తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి.తెలుగుదేశం పార్టీ వారు వీటిని ఎంత తీవ్ర రూపం దాల్చుతారో తెలీదు కానీ ఇది మాత్రం పెద్ద ఇష్యూ అయ్యేలానే ఉంది.తాజాగా టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా తల్లిదండ్రులను ఉద్దేశించి బూతులు మాట్లాడ్డం టీడీపీ వర్గాల్లో కలకలం రేపింది.

దీనితో టీడీపీ అధిష్టానం దేవినేనికి మరియు అతని తల్లిదండ్రులకు మరియు సభ్యసమాజానికి కొడాలి నాని క్షమాపణ చెప్పి తీరాలని మండిపడుతున్నారు.అసలు ఇలాంటి వ్యక్తులను మంత్రి వర్గంలో పెట్టుకున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ను అనాలని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.నాని మాత్రం దేవినేని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పి తీరాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఇలాంటి కామెంట్స్ చెయ్యడం కొడాలి నానికి ఎంత వరకు సమంజసం అనిపించాయి ఆయనకే తెలియాలి.