ఏపీ సీఎం జగన్ పై కొడాలి నాని ఊహించని కామెంట్స్.!

Saturday, June 8th, 2019, 03:37:49 PM IST

గత కొన్ని రోజుల నుంచి అటు రాష్ట్ర రాజకీయ వర్గాలతో పాటుగా ఇటు వైసీపీ పార్టీ శ్రేణుల్లో కూడా అసలు జగన్ క్యాబినెట్ లో ఎవరెవరికి మంత్రులుగా పదవులు అప్పగిస్తారో అని అంతా ఎదురు చూసారు.ఆ సస్పెన్స్ అంతటికీ తెర దించేస్తూ ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి వారందరి పేర్లు ప్రకటించేసి సంచలనం సృష్టించారు.అలాగే ఈ రోజు జగన్ నియమించిన మంత్రులు అందరు కూడా తమ ప్రమాణ స్వీకారాలు కూడా చేసేసారు.వారిలో సంచలన నేత అయినటువంటి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఒకరు.

అయితే తన ప్రమాణ స్వీకారంకు ముందు కొడాలి నాని జగన్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసారు.రాష్ట్రంలో ఇప్పుడున్న ఆర్ధిక పరిస్థితుల్లో జగన్ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లగలరు అని ఓ విలేఖరి అడగగా నాని అద్భుత సమాధానం ఇచ్చారు.జగన్ ఒక రాజకీయ నాయకుడిగా కన్నా ఒక మంచి వ్యాపారవేత్త అని ఆయన తన వ్యాపారాలను ఎలా నడిపించుకున్నారో అందరికీ తెలుసనీ అందులో భాగంగానే ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని కూడా జగన్ అంతే సమర్థవంతంగా అభివృద్ధి బాటలో నడిపించడం ఖాయమని జగన్ పై కామెంట్స్ చేసారు.