కొడాలి నానికి ఆ మంత్రిత్వ శాఖ రాకపోవడానికి కారణం ఇదేనా..!

Monday, June 10th, 2019, 11:20:18 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి గత నెల ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఫలితాలు వెలువడినప్పటి నుంచి జగన్ కేబినెట్‌లో ఎవరెవరు ఉంటారని ఆసక్తిగా ఎదురు చూసినా మొన్నటితో జగన్ కేబినెట్ ఎట్టకేలకు పూర్తయిపోయింది. అయితే 25 మందికి జగన్ కేబినెట్‌లో స్థానం కల్పిస్తూ అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేకూరేలా ఉండాలని సీఎం జగన్ తన మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి 6, బీసీలకు 7, కాపులకు 4, కమ్మ సామాజిక వర్గానికి 1, క్షత్రియ సామాజిక వర్గానికి 1, ఎస్సీలకు 4, ఎస్టీ లకు 1, ఆర్య వైశ్య 1, మైనారిటీ సామాజిక వర్గానికి 1 చొప్పున మంత్రి పదవులు కేటాయించారు. అంతేకాదు తన కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించారు. అయితే ఇప్పుడు ఎన్నికైన మంత్రుల పదవి కాలం కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే. ఆ తరువాత పార్టీలో మిగిలిన వారికి అవకాశం కల్పిస్తానని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే అందరూ ఊహించిన విధంగా కాకుండా మంత్రివర్గ కూర్పులో కాస్త చిన్న చిన్న మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ముందు నుంచి పక్కా మంత్రివర్గంలో చోటు లభిస్తుందనుకున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఈ సారి మంత్రివర్గంలో చోటు లభించింది. అయితే 2014లో చంద్రబాబుతో విభేదించి వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చిన నాని 2014లో కూడా విజయం సాధించారు. అయితే ఈ సారి జరిగిన ఎన్నికలలో కూడా విజయం సాధించి సీఎం జగన్ కేబినెట్‌లో మంత్రి పదవిని పొందారు. అయితే నానికి ముందు నుంచి రవాణా రంగంలో మంచి పట్టు ఉండడంతో జగన్ నానికి రవాణా రంగం అప్పచెప్తారని వార్తలు వినిపించాయి. అయితే కొడాలి నానికి, అదే జిల్లాకు చెందిన టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు గట్టి పోటీ ఉండడంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కూడా నువ్వా నేనా అనట్టుగా ఉండేది. అయితే దేవినేనికి బుద్ధి చెప్పాలంటే నానికి జలవనరుల శాఖ కేటాయించనున్నట్లు జగన్ నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు బాగా వినిపించాయి.

అయితే ఆ శాఖను జగన్ నెల్లూర్ జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్‌కి అప్పచెప్పారు. అయితే కొడాలి నానికి పౌరసరఫరాల శాఖను కేటాయించారు. అయితే జగన్ ఇలా చేయడానికి కూడా పలు కారణాలున్నాయట. విద్యార్హత పరంగా నాని కేవలం పదో తరగతి మాత్రమే పూర్తి చేశారు. అయితే చదువు లేకున్నా ప్రజా సేవకుడిగా ప్రజలలో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు నాని. అయితే జలవనరుల శాఖ ఎక్కువగా టెక్నాలజీతో ముడిపడి ఉండడంతో జగన్ నానికి ఆ శాఖను ఇవ్వకుండా ప్రజాపంపిణీ వ్యవస్థలో గతంలో జరిగిన దోపీడీ జరగకూడదని, అది కేవలం నాని వంటి వాడి వల్లే సాధ్యమవుతుందని అందుకే నానికి పౌరసరఫరాల శాఖను అప్పగించారు సీఎం జగన్.