రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్న దుర్మార్గుడు చంద్రబాబు

Tuesday, January 14th, 2020, 01:40:48 AM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి దోహదపడే మూడు రాజధానుల నిర్ణయంని ప్రతిపాదించిన రోజు నుండి అమరావతిలో నిరసన సెగలు రగులుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై ఒక్కొక్కరుగా టీడీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ ధోరణిని, ముఖ్యమంత్రి జగన్ తీరుని టీడీపీ నేతలు దారుణంగా తప్పు బడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

హైదరాబాద్ తానే కట్టానని సిగ్గులేకుండా చెప్తున్నాడని చంద్రబాబు ఫై విమర్శలు గుప్పించారు కొడాలి నాని. లక్ష కోట్లు ఖర్చు పెడితే అమరావతి మాత్రమే అభివృద్ధి చెందుతుంది, అదే డబ్బుని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఉపయోగించవచ్చు అన్నట్లు కొడాలి నాని తెలిపారు. అయితే అన్ని ప్రాంతాల అభివృద్ధి అవసరం లేదని చంద్రబాబు అంటున్నారు, చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మవద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్న దుర్మార్గుడు చంద్రబాబు అంటూ కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేసారు.