బీజేపీలో విలీనం కానున్న జనసేన.. మంత్రి కొడాలి నాని సంచలనం..!

Tuesday, December 3rd, 2019, 10:24:50 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిపోయింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాకా జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనను కొనసాగిస్తున్నప్పటికి కూడా జగన్ పాలనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జగన్ ఆరు నెలల పాలనపై అటు టీడీపీ, జనసేన తీవ్ర ఎత్తున విమర్శలు చేస్తున్నాయి.

అయితే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రస్తుత రాజకీయాలకు అమిత్ షా, మోదీ లాంటి నాయకులే కావాలని వారిని పొగడ్తలతో ముంచిన పవన్ కళ్యాణ్‌కు వైసీపీ మంత్రి కొడాలి నాని బిగ్ కౌంటర్ ఇచ్చారు. జనసేనను బీజేపీలో కలిపేందుకు పవన్ భారీ ఏర్పాట్లు చేసుకున్నారని అందుకే మోదీ, అమిత్ షాలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారని ఆరోపించారు. ఇకపోతే మోదీ, అమిత్ షాలను పొగిడితే పవన్ ఇక ఎందుకు జైలుకు వెళ్తారని అన్నారు. అయితే చంద్రబాబు తానా అంటే పవన్ తందానా అనడం మొదటి నుంచి చూసిందే అని అన్నారు.