ఆయన వచ్చిన పీకేదేమి లేదు.. నిమ్మగడ్డపై విరుచుకుపడ్డ మంత్రి కొడాలి నాని..!

Saturday, May 30th, 2020, 07:00:47 PM IST


ఏపీ ఎన్నికల కమీషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను కొనసాగించాలని నిన్న హైకోర్ట్ కీలక తీర్పునివ్వడంతో తిరిగి ఆయన ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి కొడాలి నాని ఏపీకి మళ్ళీ ఎన్నికల కమీషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వచ్చినా ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదన్నారు.

అంతేకాదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ కనుసన్నల్లో వ్యవస్థలను నడిపారని, దానిని అసలు హైకోర్ట్ పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. అయితే రమేష్ కుమార్ మళ్ళీ ఎస్ఈసీగా వచ్చినా చిటికెన వేళ్ల మీద వెంట్రుకలు కూడా పీకలేరని కోర్టుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినా అనుకున్న పని ప్రజల కోసం చేసి తీరతామని అన్నారు.