కోదండ‌-రేవంత్ క‌ల‌యిక‌లో మ‌రో `ఆప్ పార్టీ`!?

Saturday, January 21st, 2017, 06:33:18 PM IST

kodanda-ram-revanth-reddy
తెలంగాణ‌లో మ‌రో రాజ‌కీయ పార్టీ ఆవిర్భావం గురించి ఇటీవ‌లి కాలంలో విస్త్ర‌తంగా చుర్చ సాగుతోంది. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌పాత్ర పోషించిన ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ ప్ర‌స్తుతం కేసీఆర్ ప్ర‌భుత్వానికి యాంటీగా మారారు. కేసీఆర్ తీరుతెన్నుల్ని తూర్పార‌బ‌డుతూ ప్ర‌జ‌ల పక్షాన నిలుస్తున్నారు. మ‌రోవైపు తేదేపా, కాంగ్రెస్‌లు పూర్తిగా నీరుగారి ఉన్నాయి కాబ‌ట్టి క‌చ్ఛితంగా కేసీఆర్‌ని ఢీకొట్టే పార్టీ అవ‌స‌రం కూడా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇలాంటి సంద‌ర్భంలోనే ఓ కొత్త స‌మీక‌ర‌ణం గురించి తెలుగాణ పొలిటిక‌ల్ కారిడార్‌లో చ‌ర్చ సాగుతోంది.

దీన‌ర్థం ఏమంటే.. ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ దిల్లీ `ఆప్‌` పార్టీ త‌ర‌హాలో ఓ పార్టీ పెట్ట‌బోతున్నారు. ఈ పార్టీలో తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి కూడా చేరుతున్నారు. అలాగే కాంగ్రెస్‌లో ప్ర‌జాక‌ర్ష‌క నేత‌లు ఇందులో ఉంటారు. టీజేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రామ్ సార‌థ్యంలో ఇది మొద‌లై కేసీఆర్‌ని ఢీకొడుతుంద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల “తెలంగాణ‌లో ప్ర‌త్యామ్నాయ‌ రాజకీయం “అన్న అంశంపై తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ ఆధ్వర్యంలో రాజ‌ధానిలో జరిగిన స‌మావేశంలో ఆప్ మాజీ నేత ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ చేసిన కామెంట్ల‌ను బ‌ట్టి ఇది అర్థం చేసుకోవాల్సొస్తోంది. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే టీ జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం పార్టీ పెట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని ఆయ‌న అన్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వంపై దిల్లీ ఆప్ త‌ర‌హాలో పోరాడే పార్టీ అవ‌స‌రం కూడా ఇప్పుడు పుష్క‌లంగా ఉంది గ‌నుక ప్ర‌జ‌ల అండ‌దండ‌లు కొత్త పార్టీకి ఉంటాయ‌న‌డంలో సందేహం లేదు. మ‌రి కోదండ నుంచి స‌మాధానం రావాల్సి ఉందింకా.