కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కోదండరాం

Friday, October 18th, 2019, 11:59:10 AM IST

హుజుర్ నగర్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడటం తో రాజకీయాలు చాల వేడెక్కాయి. ఒక పక్కన ఆర్టీసీ సమ్మె జరుగుతున్న నేపథ్యం లో ప్రతిపక్షాలకి ఎన్నికల ప్రచారం లో మంచి న్యూస్ అయిందని చెప్పాలి. ఇప్పటికే కేసీఆర్ చాల మొండిగా వ్యవహరిస్తున్నారని, ఆయన ఎవరు చెప్పిన విన్నారని కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేసారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం. సకల జనుల సమ్మెకు ఊపిరి పోసిన ఆర్టీసీ కార్మికుల పై కేసీఆర్ తీరు దారుణమని కోదండరాం అన్నారు.

ప్రజలందరూ తెరాస పాలనని వ్యతిరేకిస్తున్నారని, హైకోర్టు చెప్పిన కేసీఆర్ వినడం లేదని అన్నారు. ఇపుడు హుజుర్ నగర్ లో తెరాస ని గెలిపిస్తే తన నిర్ణయాలు సరైనవని ప్రజలే భావిస్తున్నారని, ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉందని కోదండరాం అన్నారు. రుణమాఫీ, ఫీజు రీఎంబర్స్మెంట్, డబుల్ బెడ్ రూమ్ పథకాలు అమలు కావాలంటే కాంగ్రెస్ కి ఓటెయ్యల్సిందిగా కోరారు. ఉత్తమ్ పద్మరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో వున్న విషయం అందరికి తెలిసిందే. ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులూ ఒక్కొక్కరుగా కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఖాళీలను కూడా భర్తీ చేయాలనీ పరిస్థితిని గుర్తు చేసారు.