కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన వాఖ్యలు చేసిన కోదండరాం…

Sunday, August 25th, 2019, 03:00:19 AM IST

తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలందరికోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ఇటీవలే ఘనంగా జరుపుకున్నారు కూడా… కాగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చాలా అవినీతి జరిగిందని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం ఆరోపిస్తున్నారు… కాగా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడితే ప్రభుత్వానికి పెట్టుబడి ఖర్చు, నిర్వహణ వ్యయం తక్కువగా అయ్యుండేదని, కానీ కెసిఆర్ ప్రభుత్వం కావాలనే ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని కోదండరాం తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాగా ఈమేరకు కోదండరాం పార్టీ ప్రతినిధి బృందం తో కలిసి శనివారం నాడు తుమ్మిడిహెట్టి సందర్శించారు. ఈసందర్భంగా మాట్లాడిన కోదండరాం కొన్ని కీలకమైన అంశాలను వెల్లడించారు.

కాగా కోదండరాం పార్టీ బృందం తో పాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ డా. పాల్వాయి హరీష్ కూడా తుమ్మిడి హెట్టి ని సందర్శించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా ఖర్చుతో కూడుకున్నదని, కాగా ఈ కాళేశ్వరం పనికి చాలా ఖర్చు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇకపోతే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ కట్టడం వలన అక్కడి ప్రజలందరి నీటి సౌకర్యాలు తీరేవని ఆతరువాత ఇక్కడి నుండి ఎల్లంపల్లి కి, అక్కడి నుండి దిగువకు తక్కువ ఖర్చుతో ఎత్తిపోయవచ్చని కోదండరాం అన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను తప్పారని, కానీ ఇప్పటికి కూడా తన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉందని, ఒకవేళ తన తప్పుని సరిదిద్దుకోపోతే, ఇక్కడి ప్రజలందరితో కలిసి మరొక ఉద్యమం చేపడతామని కోదండరాం హెచ్చరించారు.