ఉద్యమకారులను అణచివేస్తున్నారు.. సీఎం కేసీఆర్‌పై కోదండరాం సీరియస్..!

Sunday, May 2nd, 2021, 01:30:52 AM IST

తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొ. కోదండరాం స్పందించారు. ఈటల రాజేందర్ మీద వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలి.. ఈటల కూడా అదే డిమాండ్ చేస్తున్నారని కోదండారం అన్నారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి, ముతిరెడ్డి మీద ఎందుకు ఈ ప్రభుత్వం విచారణ జరపలేదని కోదండరాం ప్రశ్నించారు.

అయితే ప్రత్యర్థులను లొంగ తీసుసుకోవడానికే సీఎం కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన వాళ్ళను కేసీఆర్ అణగదొక్కాలని చూస్తున్నారని, ఆరేండ్లుగా అదే చూశామని, ఇప్పుడు కూడా అదే చూస్తున్నామని కోదండరాం అన్నారు. గులాబీ పార్టీకి మేమే బాసులం అని ఈటల మాట్లాడినందుకే ఆయనపై ఇప్పుడు ఈ ఆరోపణలు బయటకొచ్చాయని ఇలాంటి వాటితో ప్రశ్నించే వారిని లొంగ దిసుకోవడం కోసమే తప్పితే న్యాయం కోసం ప్రభుత్వం విచారణ చేయించడం లేదని కోదండరాం ఆరోపించారు.