కోడెల‌ : టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై వైసీపీ దాడులు

Thursday, June 13th, 2019, 02:06:03 PM IST

ప్ర‌జ‌ల‌ను, వ్యాపారుల‌ను బెదిరించి డ‌బ్బు వ‌సూలు చేసిన కోడెల కుటుంబ స‌భ్యులెవ్వ‌రూ చ‌ట్టం నుంచి త‌ప్పించుకోలేరు. `కే` ట్యాక్స్ పేరుతో వంద‌ల కోట్లు దోచుకున్నారు. దీనికి స‌హ‌క‌రించిన అధికారులు కూడా దోషులే. నిర్భంద వ‌సూళ్ల మాఫియాపై విచార‌ణ జ‌రుగుతుంది. బాధితులు నిర్భ‌యంగా ఫిర్యాదు చేయాలి` ట్విట్ట‌ర్‌లో రెండు మూడు రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కుటుంబంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై తాజాగా మాజీ స్పీక‌ర్‌, టీడీపీ సీనియ‌ర్ నేత కోడెల శివ‌ప్ర‌సాద‌రావు స్పందించారు.

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లు రెచ్చ‌గొట్టేలా వున్నాయ‌ని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలో వుండ‌గా ప్ర‌తి ప‌క్ష పార్టీల‌కు చెందిన కార్య‌క‌ర్త‌ల్ని వేధించ‌లేద‌ని, కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డ‌లేద‌ని కానీ వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక తేదేపా కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు ఎక్కువ‌య్యాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వైసీపీ దౌర్జ‌న్యాలు త‌ట్టుకోలేక మా కార్య‌క‌ర్త‌లు ఊళ్లు వ‌దిలి ప్రాణ భ‌యంతో వెళ్లిపోతున్నార‌ని, గ్రామాలు విడిచి వెళ్లే ప‌రిప్థితి దాపురించింద‌ని కోడెల చెప్పుకొచ్చారు. అధికార పార్టీ చేస్తున్న దాడుల నుంచి పోలీసులు కూడా ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేక‌పోతున్నార‌ని, త‌న క‌టుంబంపై పెట్టిన కేసుల‌కు తాను భ‌య‌ప‌డ‌బోన‌ని, ఎన్నికేసులు పెట్టినా న్యాయ‌పోరాటం చేస్తాన‌ని సెల‌విచ్చారు. కోడెల కౌంట‌ర్‌కు వైసీసీ ఏ స్థాయిలో రీ కౌంట‌ర్ ఇస్తుందో చూడాలి.