బిగ్ బ్రేకింగ్ న్యూస్ : జగన్ కు బిగ్ షాక్..కోడెల కుమార్తె సంచలన నిర్ణయం!?

Wednesday, September 18th, 2019, 10:33:56 AM IST

తెలుగుదేశం పార్టీ కీలక నేత మరియు మాజీ స్పీకర్ అయినటువంటి కోడెల శివ ప్రసాద్ ఇటీవలే ఆత్మ హత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే.దీనితో ఒక్కసారిగా కోడెల కుటుంబ సభ్యులు సహా మొత్తం తెలుగుదేశం క్యాడర్ కూడా దిగ్బ్రాంతికి లోనయ్యింది.ఇదిలా ఉండగా ఇప్పుడు ఈయన మరణం పట్ల ఏపీ రాజకీయ వర్గాల్లో సరికొత్త వేడి రాజుకుంటుంది.మళ్ళీ ఒక పార్టీ మీద మరొక పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చెయ్యడం ప్రారంభించి ఈ విషాద ఘటనను కూడా రాజకీయం చేసేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ వారేమో వైసీపీ ప్రభుత్వం వలనే కోడెల మరణించారని వైసీపీ వారేమో చంద్రబాబు వల్లే కోడెల చనిపోయారని ఎవరిమట్టుకు వారు ఒకరిపై పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు.అయితే ఇదంతా పక్కన పెడితే కోడెల కుమార్తె అయినటువంటి విజయలక్ష్మి ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

తన తండ్రి జగన్ ప్రభుత్వం వలనే చనిపోయారని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది.కేవలం పొలిటికల్ రివెంజ్ కోసమే తన తండ్రిని మరియు సోదరులపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేసారని అందువల్లే తన తండ్రి చనిపోయారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.అందువల్ల జగన్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు.మరి దీనిపై జగన్ సర్కార్ ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.