కోడెల అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు ఒద్దు–కుటుంబ సభ్యులు

Wednesday, September 18th, 2019, 10:46:08 AM IST

కోడెల శివ ప్రసాద్ అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలను ఆవేదనతో తిరస్కరించారని టీడీపీ నేత జి.వీ. ఆంజనేయులు తెలిపారు. కోడెల శివ ప్రసాద్ అంతిమ యాత్ర ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుందని తెలియజేసారు. నగరం లోని సమీప హిందూ స్మశాన వాటికలో దహన సంస్కారాలు జరుగుతాయని తెలియ జేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు గారు కూడా హాజరవుతారని సమాచారం.

మునుపు ఊరేగింపు చర్యల ఫై పలు ఆంక్షలు విధించిన, ప్రస్తుతం కోడెల అంత్యక్రియల ఊరేగింపు పై నిషేధాజ్ఞలు లేవని వినీత్ బ్రిజ్లాల్ నిన్ననే (మంగళవారం) స్పష్టం చేసారు. వైసీపీ తీరు పట్ల తీవ్ర ఆవేదన చెందిన కుటుంబ సభ్యులు, అందుకొరకు ప్రభుత్వం లాంఛనాలను తిరస్కరించే అవకాశం ఉండొచ్చు. ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్ గా గౌరవ ప్రదమైన హోదాలో ప్రజలకు సేవ చేసిన వ్యక్తికీ జీవిత చివరి కాలంలో ఇలా జరగడం బాధాకరం, శోచనీయం అని అంటున్నారు ప్రజలు.