షాకింగ్ : కోడెల కి గుండెపోటు – పరిస్థితి విషమం

Friday, August 23rd, 2019, 11:58:05 PM IST


ఆంధ్రప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు కొద్దీ సేపటి క్రితం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. తక్షణమే స్పందించిన ఆయన కుటుంబ సభ్యులు ఆయనని గుంటూరులోని లక్ష్మి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారని సమాచారం. కాగా ఆయన్ని పరీక్షించిన వైద్యులు ప్రస్తుతానికి కోడెల పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిపారు. కాగా అక్కడి వాతావరణం అంత కూడా టీడీపీ కార్యకర్తలు మరియు కోడెల అభిమానులందరితో నిండిపోయింది. కాగా గతకొంత కాలంగా ఆయన తీవ్రమైన నేరారోపణలతో సావాసం చేస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కోడెల ఓడిపోయినప్పటినుండి కూడా ఆయన మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.

అయితే అసెంబ్లీకి సంబందించిన సామాగ్రిని దొంగతనంగా ఆయన ఇంట్లో పెట్టుకున్నారన్న వార్తలు బాగానే వచ్చాయి… కాగా ఆవార్తలపై స్పందించిన కోడెల… ఆఫీసులో స్థలం లేని కారణంగానే ఆసామాగ్రిని తన ఇంట్లో దాచిపెట్టానని ఒప్పుకున్నారు. అయితే వీటితో పాటు కోడెల కుమారుడు మరియు కుమార్తె కూడా తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొన్నారు. కాగా అయితే చాల రోజుల నుండి వస్తున్నటువంటి ఆరోపణల వలన కోడెల శివప్రసాదరావు ఇలా తీవ్రమైన ఇబ్బంది గురవడం వల్లే ఇలా గుండెపోటు వచ్చిందని కోడెల కుటుంబసభ్యులు వెల్లడించారు.