కోడెల ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్…ఇలా అయితే ఎలా?

Sunday, December 15th, 2019, 05:26:26 PM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వల్లే తమ తండ్రి కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని విజయలక్ష్మి ఆరోపణలు చేసారు. బంజారాహిల్స్ లోని పోలీస్ స్టేషన్ లో ఆమె ఈ ఫిర్యాదు చేసారు. కోడెలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మానసికంగా వేదించిందని అందుకే కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని ఫిర్యాదులో తెలిపారు. రాజకీయంగా ప్రతీకార దాడులకు జగన్ ప్రభుత్వం పాల్పడుతుందని తెలిపారు.

కోడెల మృతి అనంతరం ఆయన సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కోడెల ఆత్మహత్య చేసుకున్న ప్రదేశం లోని వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. అయితే ఈ కేసులో ఆసక్తికర విషయం ఏమిటంటే, కోడెల శివ ప్రసాద్ రావు మృతదేహానికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటివరకు పోలీసులకు అందలేదు. అయితే మరో పది రోజుల్లో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ రానుందని సమాచారం. ఈ నివేదిక అందిన తరువాత ఈ కేసుకి సంబంధి దర్యాప్తు వేగవంతం కానుంది.