కోడెల హెల్త్ అప్ డేట్స్ – ఫోన్ లో పరామర్శించిన చంద్రబాబు

Sunday, August 25th, 2019, 02:24:40 AM IST


ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకి నిన్న గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో చేరిన విషయం మనకు తెలిసిందే. కాగా ఆసుపత్రిలో చేరగానే ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు తేల్చి చెప్పేశారు. కాగా ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని, ఆయన శ్వాస తీసుకోడానికి ఇప్పటికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని కోడెల శివప్రసాదరావు అల్లుడు డాక్టర్ మనోహర్ తెలిపారు. ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవ్వడం వల్లే ఆయనకీ గుండెపోటు వచ్చిందని డాక్టర్లు తెలిపారు. కాగా గతంలో కూడా ఆయనకు ఇలాగె ఒకసారి గుండెపోటు వచ్చిందని, ఆసమయంలో ఆయనకీ స్టెంట్ వేశామని చెప్పారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కోడెల అల్లుడు డాక్టర్ మనోహర్ కి ఫోన్ చేసి కనుక్కుని, కోడెలని పరామర్శించారం సమాచారం.

కాగా 48 గంటలు గడిచిన తరువాత ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటే యాంజియోగ్రామ్ చేస్తామని, అవసరమైతే ఆయనని హైదరాబాద్ లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కు తరలించాల్సిన అవసరం ఉందని కోడెల అల్లుడు, డాక్టర్ మనోహర్ కు చంద్రబాబు సూచించారు. కాగా ప్రస్తుతానికి గుంటూరులోని శ్రీ లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఐసీయూ లో కోడెలకు చికిత్స జరుగుతోందని ఆయన వివరించారు.