కోడెల కుమారుడిపై కేసు – కారణం అంత పెద్దదా…?

Sunday, June 9th, 2019, 11:51:52 AM IST

మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుమారుడు కోడెల శివరాం, మరియు తన వ్యక్తిగత సహాయకుడు గుత్తా ప్రసాద్, మరియు ఇంజనీర్ ఉన్నం వేణుగోపాలరావు లపై నేడు పోలీస్ కేసు నమోదైంది. భవనాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని బెదిరింపులకు గురి చేసి, వారి వద్దనుండి డబ్బులు తీసుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మల్లికార్జున్ రావు అనే బాధితుడి చేత ఫిర్యాదు చేయబడినటువంటి కేసు ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు వన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మం… పోలీసులకు అందిన వివరాల ప్రకారం రావిపాడు కి చెందిన కె.మల్లికార్జున్ రావు అనే వ్యక్తిని బెదిరించి తన భవన నిర్మాణానికి అనుమతి కావాలంటే 17 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాగా రెండు సంవత్సరాల క్రితం మల్లికార్జున్ రావు అనే వ్యక్తి ఇంజినీర్ వేణుగోపాలరావు ని కలుసుకొని తనకు సంబందించిన కొన్ని అనుమతులకు దరఖాస్తు చేసుకున్నారు. అందుకుగాను కొంత ఫీజు మరియు మరికొంత లంచం కూడా ఇచ్చుకున్నారు మల్లికార్జున్ రావు. కానీ అందుకు వేణుగోపాల్ రావు అనుమతి ఇవ్వలేదు. కాగా తనకు అనుమతి రావాలంటే కోడెల శివప్రసాద్ కి 17 లక్షలు చెల్లించాలని లేకపోతె అనుమతి లభించదని బెదిరించినట్లు సమాచారం. అంతేకాకుండా పంచాయితీ సిబ్బందిని ఉపయోగించి తాను కట్టుకుంటున్న నిర్మాణాన్ని ఆపించివేశాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అంతేకాకుండా నరసారావు పేటకు చెందిన పద్మావతి అనే మహిళను డబ్బులు డిమాండ్ చేశారని, తన పొలం సాగు చేసుకోవాలంటే 20 లక్షలు కట్టాలని కండిషన్ పెట్టారని, లేకపోతె సాగు చేసుకోవడాన్ని అడ్డుకుంటామని కోడెల శివరామ్ హెచ్చరించినట్లు నరసారావు పేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందుకున్నటువంటి నరసరావుపేట రూరల్ పోలీసులు విచారణ మొదలుపెట్టారు.